గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 04, 2020 , 16:21:23

సాత్విక్-చిరాగ్​ జోడీ అద్భుత విజయానికి ఏడాది

సాత్విక్-చిరాగ్​ జోడీ అద్భుత విజయానికి ఏడాది

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి – చిరాగ్ శెట్టి జోడీ అద్భుత విజయం సాధించి నేటికి ఏడాది ముగిసింది. గతేడాది ఆగస్టు 4న జరిగిన థాయ్​లాండ్ ఓపెన్​ ఫైనల్​లో విజయం సాధించిన సాత్విక్ – చిరాగ్​… సూపర్​ 500 టైటిల్ సాధించిన భారత తొలి డబుల్స్​ జోడీగా చరిత్ర సృష్టించింది. తుదిపోరులో సాత్విక్ ద్వయం 21-19, 18-21, 21-18 తేడాతో లీ జున్​హుయ్​- లీ యూచెన్​(చైనా)పై విజయం సాధించింది. ఈ గెలుపును గుర్తు చేస్తూ భారత బ్యాడ్మింటన్​ సంఘం(బాయ్​) మంగళవారం ట్వీట్ చేసింది. ఆ టోర్నీలో సాత్విక్​-విజయ్ సాధించిన విజయాలపై ప్రత్యేక వీడియో ఉంచింది. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్​  పురుషుల డబుల్స్​ ర్యాంకింగ్స్​లో 10వ స్థానంలో ఉన్న సాత్విక్​-చిరాగ్ జోడీ.. దాదాపు టోక్యో ఒలింపిక్స్​కు కూడా అర్హత సాధించినట్టే. 


logo