సోమవారం 08 మార్చి 2021
Sports - Jul 17, 2020 , 17:36:56

ENGvWI: శతకంతో మెరిసిన సిబ్లే..స్టోక్స్‌ 99 నాటౌట్‌

ENGvWI: శతకంతో మెరిసిన సిబ్లే..స్టోక్స్‌ 99 నాటౌట్‌

మాంచెస్టర్: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ భారీ స్కోరుపై కన్నేసింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ డొమినిక్‌  సిబ్లే(101: 312 బంతుల్లో 4ఫోర్లు) శతకంతో చెలరేగాడు.  బెన్‌స్టోక్స్‌(99) సెంచరీకి చేరువలో  ఉన్నాడు.    సిబ్లీకిది రెండో టెస్టు సెంచరీ కావడం విశేషం.   లంచ్‌ విరామ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 108  ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 264 పరుగులు చేసింది. సిబ్లీ(101), స్టోక్స్‌(99) క్రీజులో  ఉన్నారు.  

 టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బర్న్స్‌(15), జాక్‌ క్రాలీ(0), జో  రూట్‌(23)  విఫలమైనా... సిరీస్‌లో నిలవాలని వీరిద్దరూ  పట్టుదలతో ఆడుతున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ సంయమనంతో  ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిస్తున్నారు.    తొలి టెస్టులో రెచ్చిపోయిన విండీస్‌ బౌలర్లు ఈ జోడీని విడదీసేందుకు  శ్రమిస్తున్నది.   రెండోరోజు ఆట  మొదటి సెషన్‌లో ఇంగ్లాండ్‌ ఆధిపత్యం కొనసాగింది.  


VIDEOS

logo