గురువారం 03 డిసెంబర్ 2020
Sports - May 09, 2020 , 16:35:13

అదో క్లిష్ట‌మైన షాట్: యువ‌రాజ్‌

అదో క్లిష్ట‌మైన షాట్:  యువ‌రాజ్‌

న్యూఢిల్లీ:  పేస్ బౌలింగ్‌లో క‌వ‌ర్స్ మీదుగా తానాడిన సూప‌ర్ సిక్స‌ర్ భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్‌సింగ్ సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున ఆడిన సమ‌యంలో ప్ర‌వీణ్ కుమార్ వేసిన బంతిని క‌వ‌ర్స్ మీదుగా సొగ‌సైన షాట్‌తో సిక్స‌ర్ బాదాడు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఐపీఎల్ 13వ సీజ‌న్ ర‌ద్దు కావ‌డంతో ప్ర‌స్తుతం క్రికెట‌ర్లంతా ఖాళీగా ఉంటున్న విష‌యం తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో శ‌నివారం యువ‌రాజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పాత వీడియోను షేర్ చేశాడు. పేస్ బౌలింగ్‌లో క్లిష్ట‌మైన షాట్ అని దీనికి వ్యాఖ్య జోడించాడు. ఇక ఈ వీడియోకు ఇన్‌స్టాలో తెగ లైకులు వ‌స్తున్నాయి. స‌హ‌చ‌రులు హ‌ర్భ‌జ‌న్‌, శిఖ‌ర్ ధ‌వ‌న్‌, ప్ర‌వీణ్ కుమార్.. యువీ సిక్స‌ర్‌ను కొనియాడారు.