ఆదివారం 06 డిసెంబర్ 2020
Sports - Oct 24, 2020 , 01:16:54

క్రీడాభివృద్ధికి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి

క్రీడాభివృద్ధికి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : క్రీడల అభివృద్ధికి ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకాధికారి ఉండాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్రీడల అభివృద్ధి, ఆధునిక సౌకర్యాల కల్పనపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా క్రీడల శిక్షణ కొనసాగించాలని సూచించారు. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న డీవైఎస్‌వో పోస్టుల్లో క్రీడాశాఖ అధికారులను ఇంఛార్జీలుగా నియమించాలని లేదా ఔట్‌సోర్సింగ్‌ విధానం ద్వారా ఎంపిక చేసి వెంటనే నియమించాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్‌లో మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి డీపీఆర్‌ తయారుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ సభ్యులు రాజేంద్రప్రసాద్‌, ఇతర అధికారులు సుజాత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.