సోమవారం 08 మార్చి 2021
Sports - Jul 23, 2020 , 01:19:54

చివరి గేమ్‌ల్లో విశ్వనాథన్‌కు ఎదురుదెబ్బ

 చివరి గేమ్‌ల్లో విశ్వనాథన్‌కు ఎదురుదెబ్బ

చెన్నై: లెజెండ్స్‌ ఆఫ్‌ చెస్‌ టోర్నమెంట్‌ రౌండ్‌ రౌండ్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో తొలి మూడు గేమ్‌లను సమం చేసుకున్న భారత గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ చివరి దాంట్లో తడబడ్డాడు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ టోర్నీ జరుగుతుండగా.. బుధవారం రెండో రౌండ్‌ నాలుగో గేమ్‌లో ఓడిన ఆనంద్‌ 1.5-2.5 తేడాతో కార్ల్‌సన్‌ చేతిలో పరాజయం చెందాడు. అలాగే తొలి రౌండ్‌లోనూ విశ్వనాథన్‌ ఇలాగే వెనుకబడ్డాడు. పీటర్‌ స్విడ్లెర్‌(రష్యా)తో జరిగిన ఆ రౌండ్‌లో తొలి మూడు గేమ్స్‌ను డ్రాగా ముగించి.. చివరి గేమ్‌లో ఓ ఎత్తు తప్పుగా వేశాడు. దీంతో 1.5-2.5తో ఓడిపోయాడు. కాగా బియల్‌ అంతర్జాతీయ చెస్‌ ఫెస్టివల్‌ క్లాసిక్‌ ఈవెంట్‌లో రెండో రౌండ్‌ను కూడా భారత గ్రాండ్‌మాస్టర్‌ పి.హరికృష్ణ డ్రాగా ముగించాడు. 

VIDEOS

logo