సోమవారం 30 నవంబర్ 2020
Sports - Jul 02, 2020 , 00:54:25

‘వివో’తో తెగదెంపులు కష్టమే!

‘వివో’తో తెగదెంపులు కష్టమే!

న్యూఢిల్లీ: చైనా సంస్థల స్పాన్సర్‌షిప్‌లను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే సమీక్షిస్తుందని బోర్డుకు చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న చైనా మొబైల్‌ తయారీ సంస్థ ‘వివో’కు నిష్క్రమణ నిబంధనలు లాభించేలా ఉంటే.. బీసీసీఐ ఆ సంస్థతో తెగదెంపులు చేసుకోదని బుధవారం అభిప్రాయపడ్డారు. కాగా త్వరలోనే ఈ విషయంపై ఐపీఎల్‌ పాలకవర్గ సమావేశాన్ని బీసీసీఐ నిర్వహించే అవకాశం ఉంది. 2022 వరకు ఒప్పందం ఉండగా ఒకవేళ ఇప్పుడే రద్దు చేసుకుంటే వివోకు బీసీసీఐ భారీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది. 

ముంబైలో ఐపీఎల్‌? 

కరోనా వైరస్‌ అదుపులోకి వస్తే ముంబై నగరంలో ఐపీఎల్‌ నిర్వహించాలనే వాదన తెరపైకి వచ్చింది. ‘ముంబైలో నాలుగు అత్యుత్తమ మైదానాలు ఉన్నాయి. బయో బబుల్‌ను ఏ ర్పాటు చేసి ఐపీఎల్‌ నిర్వహించేందుకు ఆ నగరం అనుకూలంగా ఉంటుంది. అయితే అంతా కరోనా పరిస్థితిపై ఆధారపడి ఉంటు ంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ముంబైలోని వాంఖడేతో పాటు డీవై పాటిల్‌, బ్రబోర్న్‌ మైదానాల్లో ఇదివరకు ఐపీఎల్‌ మ్యా చ్‌లు జరిగాయి. రిలయన్స్‌ స్టేడియం కూడా మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది.