గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Jul 10, 2020 , 13:33:11

సోదరీమణుల ముందే నరికి చంపారు

సోదరీమణుల ముందే నరికి చంపారు

బెంగళూరు : ఓ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిని తన సోదరీమణుల ముందే నరికి చంపిన ఘటన కనకపూర రోడ్డు వద్ద బుధవారం రాత్రి జరిగింది. వివరాలు.. కొననకుంటేకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి వినోద్ కుమార్ (32) బుధవారం సాయంత్రం తన సోదరితో టాటగునిలోని తన మరో సోదరి నివాసానికి వెళ్లాడు. అక్కడి నుంచి ముగ్గురు కలిసి కొననకుంటేకు వస్తుండగా ఎనిమిది మంది దుండగులు బైకులపై వెంబడించి కారును చుట్టుముట్టి సోదరీమణుల ముందే కిరాతకంగా నరికి చంపారు. మృతుడు వినోద్ కుమార్ బీబీఎంపీ కౌన్సిల్‌లో అంజనాపుర వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్ సోమశేఖర్‌కు మేనల్లుడు. ఈ సంఘటన జరిగినప్పుడు ఇద్దరు చెళ్లెళ్లు అతడితో పాటు కారులోనే ఉన్నారు. వినోద్‌ కుమార్‌ తప్పించుకునే ప్రయత్నం చేసినా దుండగులు వెంబడించి మరీ నరికారని వారు తెలిపారు. అయితే పాత కక్ష్యల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo