శనివారం 04 జూలై 2020
Sports - May 30, 2020 , 22:33:20

ధోనీని గమనిస్తూనే..

ధోనీని గమనిస్తూనే..

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ కెప్టెన్సీలో చాన్నాళ్లు క్రికెట్‌ ఆడటం తనకు ఉపయోగ పడిందని ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ రద్దు కావడంతో ప్రస్తుతం ఇండ్లకే పరిమితమైన ఆటగాళ్లు.. సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న విరాట్‌.. నాయకత్వం, ధోనీని దగ్గర నుంచి పరిశీలించడం, అంతర్జాతీయ క్రికెట్‌లో జట్టుకు సారథ్యం వహించడం వంటి పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించాడు.

‘నా కెరీర్‌లో అత్యధిక శాతం ధోనీ కెప్టెన్సీలోనే ఆడాను. చాన్నాళ్లుగా అతడిని దగ్గర నుంచి గమనిస్తున్నా. ఒక్క రోజులోనే ఏ ఒక్కరూ కెప్టెన్‌ కాలేరు. బాధ్యతలు భుజానెత్తుకునేందుకు సిద్ధంగా ఉండే వాళ్లే మెల్లగా నాయకత్వం వైపు ఆకర్షితులవుతారు. ఆరేడేండ్లు ధోనీ పక్కనే నిల్చున్నా. అతడితో తరచూ మాట్లాడుతూ.. ధోనీ తీసుకునే నిర్ణయాలను గమనిస్తూ ముందుకు సాగా. స్లిప్‌లో నిల్చున్నప్పుడు ఇది చేయొచ్చేమో.. అది చేయొచ్చేమో అని అంటూ ఉండేవాడిని. ఇలా నెమ్మదిగా ఎదిగా. అంతేకాని రాత్రికి రాత్రే ఎవరు నాయకులు కాలేరు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.  


logo