బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 08, 2020 , 15:50:32

అల్లు అర్జున్ స్టైల్​లో.. అల దుబాయ్​లో వార్నర్​

అల్లు అర్జున్ స్టైల్​లో.. అల దుబాయ్​లో వార్నర్​

అల వైకుంఠపురములో సినిమాలో హీరో అల్లు అర్జున్ కోడిపుంజు పట్టుకొని నడిచి వస్తుంటే అరుపులు, విజిల్స్​తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అంతలా అతడి స్టైల్ అభిమానులను అలరించింది. కాగా అల్లు అర్జున్ కోడిపుంజుతో ఉన్న ఫొటోను ఓ అభిమాని మార్ఫింగ్ చేశాడు. ఆస్ట్రేలియా స్టార్, సన్​రైజర్స్ హైదరాబాద్​ కెప్టె​న్​ డేవిడ్ వార్నర్​ ఓ చేతిలో కోడి పుంజు, మరో చేతిలో బ్యాట్ పట్టుకొస్తూ ఐపీఎల్​కు సిద్ధమనేలా తయారు చేసి, ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు. వార్నర్​ భాయ్ మళ్లీ వస్తున్నాడు అని రాసుకొచ్చాడు. అల దుబాయ్​లో అని టైటిల్ పెట్టాడు. కాగా ఈ ఫొటోకు డేవిడ్ వార్నర్ స్పందించాడు. పోస్ట్​ను షేర్ చేసి  నవ్వుతున్నట్టు ఎమోజీలను వార్నర్ పెట్టాడు. కాగా అల వైకుంఠపురములోని బుట్టబొమ్మ పాటకు వార్నర్… భార్యతో కలిసి డ్యాన్స్ చేసి.. వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోకు అభిమానులు లైక్​ల వర్షం కురిపించారు. అలాగే మరిన్ని తెలుగు సహా హిందీ పాటలకు కూడా వార్నర్ చిందులేశాడు. 


logo