సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 08, 2020 , 17:23:26

కోహ్లీ.. రైతుల‌కు మ‌ద్ద‌తివ్వు: టీ20 మ్యాచ్‌లో అభిమాని హంగామా

కోహ్లీ.. రైతుల‌కు మ‌ద్ద‌తివ్వు: టీ20 మ్యాచ్‌లో అభిమాని హంగామా

సిడ్నీ: వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్న రైతుల‌కు మ‌ద్ద‌తివ్వంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని డిమాండ్ చేసింది ఓ క్రికెట్ అభిమాని. ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ సంద‌ర్భంగా ఓ మ‌హిళా అభిమాని.. డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న కోహ్లిని చూసి రైతుల‌కు మ‌ద్ద‌తివ్వంటూ అరుస్తున్న వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న కోహ్లి.. చాలా ఉత్సాహంగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పీస్ ఆఫ్ టాయిలెట్ పేప‌ర్ అంటూ ఆ మ‌హిళా అభిమాని కోహ్లిని పిల‌వ‌డం కూడా వీడియోలో క‌నిపిస్తుంది. కిసాన్ ఏక్తా జిందాబాద్ అంటూ ఆమె ముగించింది.  ఆమె మాట‌లు పూర్తిగా కోహ్లి విన్నాడో లేదో తెలియ‌దు కానీ.. ఆమె అరిచిన స‌మ‌యంలో అత‌డు ఆమె వైపు తిరిగి చూడ‌టం క‌నిపించింది. ఇప్ప‌టికే పంజాబ్‌, హ‌ర్యానా రైతులు చేస్తున్న ఆందోళ‌న‌కు ప‌లువురు స్పోర్ట్స్ స్టార్స్ మ‌ద్ద‌తిచ్చిన విష‌యం తెలిసిందే. త‌న‌కు ఇచ్చిన ఖేల్‌ర‌త్న అవార్డును తిరిగి ఇచ్చేస్తాన‌ని బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్ హెచ్చరించాడు.


logo