మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 03, 2020 , 21:53:00

డ్రా చేసుకోవడమే పెద్ద విజయం: అఫ్రిది

డ్రా చేసుకోవడమే పెద్ద విజయం: అఫ్రిది

కరాచీ: ఇంగ్లండ్​తో టెస్టు సిరీస్​ను పాకిస్థాన్ జట్టు సమంగా ముగించలిగితే పెద్ద విజయం సాధించినట్టేనని పాక్ మాజీ ఆల్​రౌండర్ షాహిద్ అఫ్రిది అన్నాడు. ఇంగ్లిష్ గడ్డపై టెస్టు క్రికెట్ ఎంతో కఠినమని, అయితే పాక్ జట్టు రాణిస్తుందని తనకు నమ్మకం ఉందని సోమవారం ఓ ఇంటర్వ్యూలో అతడు చెప్పాడు. ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య మూడు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్ సౌతాంప్టన్​ వేదికగా బుధవారం ప్రారంభం కానుంది.

“ఇంగ్లండ్ వాతావరణంలో టెస్టు క్రికెట్ ఆడడం ఎంతో కష్టం. మా జట్టుపై నాకు చాలా నమ్మకం ఉంది. ఒకవేళ పాక్ ఈ సిరీస్​ను డ్రా చేసుకున్నా.. విజయం సాధించినట్టే. ప్రస్తుత జట్టు మేనేజ్​మెంట్(చీఫ్ సెలెక్టర్ మిస్బా ఉల్ హక్​, బ్యాటింగ్ కోచ్​ యూనిస్ ఖాన్​, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్​)​ కూడా జట్టుకు ప్లస్​గా మారింది. కచ్చితంగా మా మాజీ స్టార్లు జట్టును అత్యుత్తమంగా ముందుకు నడిపిస్తారు” అని అఫ్రిది చెప్పాడు. 


logo