మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 11, 2020 , 09:20:03

NZvIND:అయ్యర్‌ అర్ధశతకం..

NZvIND:అయ్యర్‌ అర్ధశతకం..

న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధశతకం నమోదు చేశాడు.

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధశతకం నమోదు చేశాడు. వన్డేల్లో అతనికిది 8వ హాఫ్‌సెంచరీ కావడం విశేషం. ఆరంభంలో భారత్‌ మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో ఓపికగా క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.  విరాట్‌ కోహ్లీ పెవిలియన్‌ చేరినా కేఎల్‌ రాహుల్‌ సాయంతో అయ్యర్‌ స్కోరు బోర్డును పరుగుల పెట్టిస్తున్నాడు. 52 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. పృథ్వీ షా ఫర్వాలేదనిపించినా కివీస్‌ పేసర్ల ధాటికి టాప్‌ ఆర్డర్‌ తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరింది. 28 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 3 వికెట్లకు 148 పరుగులు చేసింది. అయ్యర్‌(56), రాహుల్‌(39) క్రీజులో ఉన్నారు. 


logo
>>>>>>