ఆస్ట్రేలియన్ ‘బంగారు చేప’ ఎమ్మా మెక్కియాన్ ఒలింపిక్స్లో కొత్త రికార్డు సృష్టించింది. ఒకే ఒలింపిక్స్లో ఏడు పతకాలు గెలిచి చరిత్ర తిరగరాసింది. ఆదివారం టోక్యో ఆక్వాటిక్స్ సెంటర్లో జరిగిన మహిళల 4X 100 మీటర్ల రిలే పోటీలలో స్వర్ణం సాధించడంతో ఎమ్మా ఈ ఘనత సాధించింది. 1952లో సోవియట్ యూనియన్ జిమ్నాస్ట్ మారియా గోరోఖోవ్ మాత్రమే (7 పతకాలు) ఈ ఫీట్ సాధించింది.