ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 24, 2020 , 15:02:32

47వ వడిలోకి సచిన్‌.. 47 ఆసక్తికరమైన విషయాలు

47వ వడిలోకి సచిన్‌.. 47 ఆసక్తికరమైన విషయాలు

హైదరాబాద్‌: దేశంలో క్రికెట్‌ అనగానే మొదట గుర్తొచ్చేది సచిన్‌ టెండుల్కర్‌. తన ఆట, వ్యక్తిత్వంతో క్రికెట్‌ను ఒక మతంలా మార్చాడు సచిన్‌. ఏప్రిల్‌ 24న తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు ఈ క్రికెట్‌ దేవుడు. తన జీవితమే క్రికెట్‌ అని, అది లేకుండా తన జీవిత చరిత్రలో ఒక పేజీకూడా ఉండదని పేర్కొన్నాడు. క్రికెట్‌ ప్రస్థానంలో అతడు సాధించిన 47 ఆసక్తికరమైన విషయాలు చూద్దాం..

1. 16 ఏండ్ల 205 రోజులు: అత్యంత పిన్న వయస్సులో టెస్ట్‌ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. 1989, నవంబర్‌ 15న పాకిస్థాన్‌తో జరిన టెస్ట్‌ మ్యాచ్‌తో క్రికెట్‌ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఐదో అత్యంత పిన్నవయస్సు ఆటగాడిగా నిలిచాడు.  

2. 34357: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు

3. 100: అంతర్జాతీయ క్రికెట్‌ చర్రితలో అత్యధిక సెంచరీలు చేసిన మొదటి ఆటగాడు సచిన్‌. 

రికీ పాంటింగ్‌ (71 సెంచరీలు), కోహ్లీ (71 సెంచరీలు)

4. 1591: టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడు

5. 51: టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు

6. 53.78: భారత టెస్ట్‌క్రికెట్‌ చరిత్రలో అత్యధిక యావరేజ్‌ 

7. 11: టెస్ట్‌ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై చేసిన సెంచరీలు

టెస్ట్‌ క్రికెట్‌లో ఒక ప్రత్యర్థిపై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో బ్రాడ్‌మెన్‌ (19- ఇంగ్లండ్‌పై), గవాస్కర్‌ (13- వెస్టిండీస్‌పై), జాక్‌ హబ్స్‌ (12- ఆస్ట్రేలియాపై) సచిన్‌ కంటే ముందున్నారు. 

8. 55: టెస్ట్‌ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై సచిన్‌ యావరేజ్‌ స్కోర్‌

9. 6: ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో టెస్టుల్లో ఆరుసార్లు వెయ్యికిపైగా పరుగులు   

1997, 1999, 2001, 2002, 2008, 2010లో జరిగిన టెస్ట్‌ మ్యాచుల్లో సచిన్‌ వెయ్యికి పైగా పరుగులు నమోదు చేశాడు.

10. 513: టెస్టుల్లో అత్యధిక యావరేజ్‌ నమోదు చేసిన ఆసియా బ్యాట్స్‌మెన్‌

11. 54.74: దేశీయ లేదా అంతర్జాతీయ వేదికలపై అత్యధిక టెస్ట్‌ యావరేజ్‌ నమోదుచేసిన ఆసియా బ్యాట్స్‌మెన్‌

12. 154: టెస్టుల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌

శ్రీలంక క్రికెటర్‌ సంగక్కర 152 ఇన్నింగ్సుల్లో ఈ రికార్డును నమోదు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌ 

13. 40-ప్లస్‌: టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన 9 టీమ్‌లపై 40 కంటే ఎక్కువ బ్యాటింగ్‌ యావరేజ్‌ కలిగిన క్రికెటర్‌ సచిన్‌

14. 78.43%: సచిన్‌ సెంచరీలు నమోదు చేసిన టెస్టు మ్యాచుల్లో భారత్‌ విజయం సాధించిన లేదా డ్రా చేసింది 

15. 17 ఏండ్ల 107 రోజులు: టెస్టుల్లో మొదటి సెంచరీ నమోదు చేసినప్పుడు సచిన్‌ వయస్సు (1990, మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో)

16. 9: టెస్టు క్రికెట్‌లో ఒకే బ్యాట్స్‌మెన్‌ను ఎక్కువసార్లు ఔట్‌ బౌలర్‌ (జేమ్స్‌ అండర్సన్‌)గా రికార్డు  

17. 136: హయ్యెస్ట్‌ ఇంప్యాక్ట్‌ టెస్ట్‌ బ్యాటింగ్‌ పర్ఫార్మెన్స్‌ (1999లో చెన్నైలో పాకిస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో)

18. 248 నాటౌట్‌: టెస్ట్‌ క్రికెట్‌లో సచిన్‌ అత్యధిక వ్యక్తిగత పరుగులు (బంగ్లాదేశ్‌పై 2004లో ఢాకాలో జరిగిన మ్యాచ్‌లో)

19. 241 నాటౌట్‌: భారత ఉపఖండం వెలుపల టెస్టుల్లో నమోదుచేసిన అత్యధిక పరుగులు (2004లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో)

20. 6: టెస్ట్‌ క్రికెట్‌లో సచిన్‌ నమోదుచేసిన డబుల్‌ సెంచరీలు

21. 18426: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోర్‌ 

22. 15310: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా చేసిన అత్యధిక పరుగులు

23. 49: వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీలు

24. 96: వన్డే చరిత్రలో అత్యధిక అర్ధ సెంచరీలు

25. 9: ఒకే ప్రత్యర్థిపై నమోదుచేసిన అత్యధిక సెంచరీలు (ఆస్ట్రేలియాపై)

వెస్టీండీస్‌పై కోహ్లీ 9 సెంచరీలు నమోదుచేశాడు 

26. 1894: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో నమోదు చేసిన అత్యధిక పరుగులు (1998లో)

27. 8717: అంతర్జాతీయ క్రికెట్‌లో 1996, జనవరి 1 నుంచి 1999, డిసెంబర్‌ 31 వరకు సచిన్‌ నమోదు చేసిన పరుగులు. వన్డేల్లో 14 సెంచరీలు, టెస్టుల్లో 20 సెంచరీలు నమోదు చేశాడు.

28. 62: వన్డే క్రికెట్‌లో అత్యధిక అవార్డులు అందుకున్న క్రికెటర్‌ సచిన్‌ (జయసూర్య 48 సార్లు అవార్డులు అందుకున్నాడు) 

29. 14: వన్డే క్రికెట్‌లో అత్యధికసార్లు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు అందుకున్నాడు. (జయసూర్య 11 సార్లు)

30. 2001, మార్చి 31: వన్డే క్రికెట్‌ చరిత్రలో 10వేల పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు

31. 7: ఏడు సార్లు ఒక క్యాలండర్‌ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు నమోదు చేశాడు (1994, 1996, 1997, 1998, 2000, 2003, 2007) 

32. 5359: అంతర్జాతీయ వన్డేల్లో 1996-99 మధ్యకాలంలో నమోదు చేసిన పరుగులు

33. 90.7Vs71.57: 1994-99 మధ్య కాలంలో టెండూల్కర్‌ వర్సెస్‌ వరల్డ్‌ స్టాండర్డ్‌

34. 67.35%: సచిన్‌ సెంచరీలు నమోదుచేసిన 67.35 శాతం మ్యాచుల్లో భారత్‌ విజయం సాధించింది

35. 124: సచిన్‌ హయ్యస్ట్‌ ఇంపాక్ట్‌ ఓడీఐ ఇన్సింగ్స్‌ (1998లో షార్జాలో జింబాంబేపై)

36. 71: వన్డేల్లో అత్యంత వేగంగా నమోదు చేసిన సెంచరీ (1998లో షార్జా హైనల్‌లో జింబాంబేపై)

37. 167.34: అత్యధిక స్ట్రయిక్‌ రేట్‌ (1994లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ 49 బంతుల్లో 82 పరుగులు స్కోర్‌ చేశాడు)

38. 200 నాటౌట్‌: వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ (2010లో దక్షిణాఫ్రికాపై)

39. 5: వన్డేల్లో ఐదుసార్లు 150కిపైగా పరుగులు చేశాడు

40. 5-32: వన్డేల్లో సచిన్‌ అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన (1998లో ఆస్ట్రేలియాపై)

41. 2278: వరల్డ్‌ కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు (44 వరల్డ్‌ కప్‌ ఇన్నింగ్సుల్లో 2278 పరుగులు చేశాడు)

42. 673: ఒక వరల్డ్‌కప్‌లో (2003) నమోదైన అత్యధిక వ్యక్తిగత పరుగులు 

43. 6: వరల్డ్‌కప్‌లో నమోదైన అత్యధిక సెంచరీలు (సచిన్‌ తర్వాత ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ)

44. 3: మూడు వరల్డ్‌ కప్పుల్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్‌ క్రికెటర్‌

45. 1. సచిన్‌ ఆడిన టీ20లు

46. 2334: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌

47. 618: ఐపీఎల్‌- 2010లో అత్యధిక పరుగులు 


logo