గురువారం 29 అక్టోబర్ 2020
Sports - Sep 19, 2020 , 17:44:49

ధోనీ 436 రోజుల తర్వాత మళ్లీ...

ధోనీ 436 రోజుల తర్వాత మళ్లీ...

దుబాయ్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో అడుగుపెడుతున్నాడు. ఏడాదికిపైగా ఆటకు దూరంగా ఉన్న మహీ ఐపీఎల్‌లో ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది.  2019 జులై 10న ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌లో  ధోనీ  ఆఖరి వన్డే ఆడాడు. చివరిసారి మ్యాచ్‌ ఆడిన  436 రోజుల తర్వాత మహీ తొలిసారి పోటీ క్రికెట్‌ ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 34 రోజుల తర్వాత మళ్లీ అతణ్ని క్రికెట్‌ మైదానంలో చూడబోతుండటంతో  అభిమానులు ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు. 

ఏడాదికి పైగా విరామం తర్వాత మ్యాచ్‌లు ఆడబోతుండటంతో  39ఏండ్ల ధోనీ ఫిట్‌నెస్‌పై సందేహాలున్నాయి.  బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో  చూడాలి.    అబుదాబి వేదికగా శనివారం రాత్రి 7.30 గంటలకు క్రికెట్‌ పండుగ ఐపీఎల్‌ 2020 సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో  డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. logo