రెండో టెస్ట్ ఆడే టీమ్ ఇదే.. రాహుల్‌కు దక్కని చోటు

మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా బాక్సింగ్ డే టెస్ట్‌కు ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్, హైదరాబాదీ పేస్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నారు. పృథ్వి షా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన గిల్.. మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. ఇక తొలి టెస్ట్‌లో మణికట్టుకు గాయం కావడంతో మహ్మద్ షమి స్థానంలో ఈ మ్యాచ్‌కు సిరాజ్‌ను తీసుకున్నారు. అయితే విరాట్ కోహ్లి స్థానంలో కచ్చితంగా తుది జట్టులోకి వస్తాడనుకున్న కేఎల్ రాహుల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. బౌలింగ్‌ను పటిష్ఠం చేయాలని భావించిన టీమ్ మేనేజ్మెంట్ రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకుంది. ఇక వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో రిషబ్ పంత్ టీమ్‌లోకి వచ్చాడు.
బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆడే తుది జట్టు: మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్