గురువారం 21 జనవరి 2021
Sports - Nov 24, 2020 , 00:15:22

బీసీసీఐకి కాసుల పంట

బీసీసీఐకి కాసుల పంట

  • ఐపీఎల్‌ ద్వారా 4 వేల కోట్ల ఆదాయం 

ముంబై: కరోనా వైరస్‌ కారణంగా టోర్నీ ఆలస్యమైనా.. వేదికను యూఏఈకి మార్చినా ఐపీఎల్‌ 13వ సీజన్‌ ద్వారా బీసీసీఐకి  కాసుల పంట పండింది. మహమ్మారి విజృంభణ తర్వాత నిర్వహించిన తొలి భారీ క్రికెట్‌ పండుగతో బోర్డుకు ఆశించిన లాభం చేకూరింది. వైరస్‌ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా.. ఈ ఏడాది ఐపీఎల్‌ వల్ల బోర్డుకు దాదాపు రూ.4వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ విషయాన్ని బోర్డు కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ సోమవారం వెల్లడించారు. టీవీల్లో వీక్షించిన వారి సంఖ్య గతంలో కంటే 25శాతం పెరిగిందని ఆయన చెప్పారు. అలాగే కరోనా నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు, సిబ్బందికి మొత్తం 30వేలకు పైగా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించినట్టు ధుమాల్‌ తెలిపారు.


logo