గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 01, 2020 , 20:52:03

KXIP vs MI: రోహిత్‌ శర్మ అర్ధశతకం

KXIP vs MI: రోహిత్‌ శర్మ అర్ధశతకం

అబుదాబి: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ నిలకడగా ఆడుతోంది.  ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 40 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌ సాయంతో అర్ధశతకం సాధించాడు. జేమ్స్‌ నీషమ్‌ వేసిన 16వ ఓవర్‌ రెండో బంతికి ఫోర్‌ కొట్టి 50 మార్క్‌ చేరుకున్నాడు. ఐపీఎల్‌లో  అతనికిది 38వ హాఫ్‌సెంచరీ కావడం విశేషం.  ఒత్తిడిలోనూ  రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ 50కి పైగా పరుగుల భాగస్వా్మ్యాన్ని నెలకొల్పారు. 

ప్రమాదకరంగా మారుతున్న  ఈ జోడీని స్పిన్నర్‌ కృష్ణప్ప గౌతం విడదీశాడు.  14వ ఓవర్‌ మొదటి బంతికి కిషన్‌..నాయర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  పంజాబ్‌ బౌలర్లు ధాటిగా బంతులేస్తుండగా బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడుతున్నారు.  ఆఖరి ఓవర్లలో వేగంగా ఆడి పరుగులు రాబట్టాలని ముంబై భావిస్తోంది. 

స్వల్ప స్కోరుకే ముంబై రెండు వికెట్లు కోల్పోవడంతో   రోహిత్‌ వీలుచిక్కినప్పుడల్లా  బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ వేసిన నాలుగో ఓవర్లో కీలక ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ రనౌటయ్యాడు. ఐదో బంతిని రోహిత్‌ వికెట్ల వెనకకు షాట్‌ ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. మమ్మద్‌ షమీ విసిరిన డైరెక్ట్‌ త్రోకు వికెట్ల మధ్య  నిర్లక్ష్యంగా  పరుగెత్తిన  సూర్యకుమార్‌ బలయ్యాడు.