శనివారం 16 జనవరి 2021
Sports - Jan 11, 2021 , 00:17:36

కోహ్లీ తర్వాత ధోనీనే

కోహ్లీ తర్వాత ధోనీనే

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా తనకు అభిమాన గణం తగ్గలేదని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ నిరూపించాడు. తాజాగా ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఫాలోవర్ల సంఖ్య 30 మిలియన్లు (3 కోట్లు) దాటింది. భారత సారథి విరాట్‌ కోహ్లీ (88 మిలియన్‌) తర్వాత 30 మిలియన్‌ మార్క్‌ను చేరిన రెండో క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు. ఇన్‌స్టాలో నిత్యం చురుగ్గా ఉండే  కోహ్లీ.. ఒక్కో పోస్టుకు రూ.కోట్లు గడిస్తున్నాడు. అయితే ధోనీ మాత్రం అంత యాక్టివ్‌గా లేకపోయినా 3 కోట్ల మంది ఫాలోవర్లను సాధించడం విశేషం.