Hamilton : మెర్సిడెస్ డ్రైవర్ లెవిస్ హమిల్టన్(Lewis Hamilton)పై జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన మాజీ చాంపియన్ నెల్సన్ పికెట్(Nelson Piquet)కు భారీ జరిమానా పడింది. పికెట్‌ను దోషిగా తేల్చిన బ్రెజిల్ కోర్టు హహిల్టన్కు 5 మిలియన్ బ్రెజిలియన్ రియల్స్ (రూ. 8 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది.
మూడుసార్లు ఫార్ములా వన్ చాంపియన్ అయిన పికెట్ 2021 నవంబర్‌లో హమిల్టన్ ప్రతిష్టను దెబ్బతీసేలా, అతడిని భయపెట్టేలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్ చాంపియన్‌షిప్‌లో మ్యాక్స్ వెర్సటప్పెన్ పోరు సందర్భంగా అతడిపై జాత్యహంకారపూరిత కామెంట్లు చేశాడు. పికెట్ కూతురు కెల్లీ, వెర్సటప్పెన్ భాగస్వామి కావడం విశేషం.
గత ఏడాది జూన్‌లో పికెట్ ఇంటర్వ్యూ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దాంతో, అతను హమిల్టన్కు క్షమాపణలు చెప్పాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అతను తెలిపాడు. అయితే.. పికెట్ వ్యాఖ్యలన్ని హమిల్టన్ ఖండించాడు. అంతేకాదు సనాతన ఆలోచనా విధానం మారాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాడు. దాంతో, పౌర హక్కుల సంఘాలు నాలుగు నష్టపరిహారం కింద పికెట్ 10 మిలియన్ల బ్రెజిల్ రియల్స్ చెల్లించాల్సిందేనని పట్టుబట్టాయి. 2022 జూన్‌లో ఈ బ్రిటీష్ రేసర్‌కు బ్రెజిల్ గౌరవ పౌరసత్వాన్ని ఇచ్చింది. ఈ హోదా పొందిన మొట్ట మొదటి నల్లజాతీయుడు అతనే.