ఆదివారం 29 మార్చి 2020
Sports - Mar 26, 2020 , 15:15:45

ముగ్గురూ మేటి బ్యాట్స్‌మెన్లే.. అయినా ఒక్క వరల్డ్‌కప్పూ ఆడలే

ముగ్గురూ మేటి బ్యాట్స్‌మెన్లే.. అయినా ఒక్క వరల్డ్‌కప్పూ ఆడలే

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్‌ కప్‌లో ఒక్క మ్యాచ్‌లోనైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్‌ కోరుకుంటాడు. కెరీర్‌లో టన్నుల కొద్ది పరుగులు చేసినప్పటికీ అతి ముఖ్యమైన ఈ టోర్నీలో మాత్రం పాల్గొనలేకపోయారు. టెస్టుల్లో తమ ఒంటి  చేతితో జట్టుకు అనేక విజయాలు అందించినప్పటికీ వన్డేల్లో ఆకట్టుకోలేకపోయారు. వారే భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ లక్ష్మణ్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కుక్‌, ఆస్ట్రేలియా బెస్ట్‌ టెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ జస్టిన్‌ లాంగర్‌. 


వీవీఎస్‌ లక్ష్మణ్‌ 

అది 2001, ఆస్ట్రేలియాతో టెస్ట్‌ మ్యాచ్‌. కోల్‌కతాలో ద్రావిడ్‌తో కలిసి 376 పరుగుల భాగస్వామ్యం. 281 వ్యక్తిగత స్కోరుతో  ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్‌ విజయాన్ని అందించాడు. 46 పరుగుల యావరేజ్‌తో మొత్తం 134 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 8781 పరుగులు. ఇందులో 17 సెంచరీలు, 53 అర్ధ శతకాలు. 31 యావరేజ్‌ స్కోర్‌తో 86 వన్డే మ్యాచ్‌లు 2338 రన్స్‌. ఇందులో ఆరు సెంచరీలు, పది హాఫ్‌ సెంచరీలు. ఈ గణాంకాలన్నీ చూస్తే టక్కున గుర్కొస్తాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌. భారత క్రికెట్లో దిగ్గజ క్రికెటర్లలో ఒకడు. ఇండియన్‌ టీమ్‌కు ఎన్నో మరపురాని విజయాలను అందించిన మేటి బ్యాట్స్‌మెన్‌. అయినా ఒక్క ప్రపంచకప్‌లోకూడా భారత్‌కు ప్రాతినిధ్యం  వహించలేకపోయాడు. 2003 ప్రపంచకప్‌కు ముందు అతడు భారత జట్టులో ప్రధాన ఆటగాడు. అత్యున్నత ఫామ్‌లో ఉన్నాడు. అయినా వరల్డ్‌ కప్‌ జట్టులో స్థానం లభించలేదు. అదనపు బౌరల్‌ కోసం సెలక్షన్‌ కమిటీ లక్ష్మణ్‌ను పక్కకుపెట్టి దినేష్‌ మోంగియాను జట్టులోకి ఎంపికచేసింది. దీంతో వరల్డ్‌ కప్‌ ఆడకుండానే అతను క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 


అలిస్టర్‌ కుక్‌

ఆ ప్రపంచకప్‌ ముందు వరకు అతడు ఇంగ్లడ్‌ జట్టు కెప్టెన్‌. అయినా వలర్డ్‌కప్‌లో ఆడలేకపోయాడు. అతడే ఇంగ్లిష్‌ ఆటగాడు అలిస్టర్‌ కుక్‌. ఇంగ్లండ్‌ టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన ఆటగాడు. 2015 వరల్డ్‌ కప్‌కు కొన్ని నెలల ముందే అతని స్థానంలో ఇయాన్‌ మోర్గాన్‌ను వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లోకి ఎంపికచేశారు. దీంతో అతడు వలర్డ్‌ కప్‌లో ఆడకుండానే తన కెరీర్‌ను ముగించాడు. కుక్‌ మొత్తంగా 161 టెస్టు మ్యాచుల్లో 46 పరుగుల యావరేజ్‌తో 12,472 పరుగులు చేశాడు. 92 మ్యాచుల్లో 3204 పరుగులు చేశాడు. 


జస్టిన్‌ లాంగర్‌

ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు కోచ్‌గా ఉన్న జెస్టిన్‌ లాంగర్‌ కూడా ఒక్క ప్రపంచకప్‌లో కూడా పాల్గొనలేదు. తన 14 ఏండ్ల కెరీర్‌లో 105 టెస్టులు ఆడిన లాంగర్‌ 45 పరుగుల యావరేజ్‌తో 7696 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 30 అర్ధశతకాలు ఉన్నాయి. టెస్టుల్లో విశేష ప్రతిభ చూపిన లాంగర్‌ వన్డేల్లో మాత్రం అంతగా రాణించలేకపోయాడు. కేవలం 8 వన్డే మ్యాచ్‌లే ఆడిన ఆయన 160 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడు ప్రపంచకప్‌ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు.


logo