బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 13, 2020 , 22:23:16

మ‌ళ్లీ వర్షం: స‌గం వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌

 మ‌ళ్లీ వర్షం:  స‌గం వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌

సౌతాంప్ట‌న్‌: ఇంగ్లండ్‌, పాకిస్థాన్ మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టును మ‌రోసారి వ‌ర్షం అడ్డుకుంది. వ‌రుణుడి కార‌ణంగా ఇప్ప‌టికే రెండు సార్లు మ్యాచ్ నిలిచిపోగా.. టీ విరామం అనంత‌రం భారీ వ‌ర్షం కురుస్తుండ‌టంతో మ‌రోసారి మ్యాచ్ ఆగింది. తొలి రోజుల ఆట‌లో 45.4 ఓవ‌ర్లు ఆడిన పాకిస్థాన్ 5 వికెట్లు కోల్పోయి 126 ప‌రుగులు చేసింది. 

తొలి టెస్టు సెంచ‌రీ హీరో షాన్ మ‌సూద్ (1) త్వ‌ర‌గానే ఔటైనా.. మ‌రో ఓపెన‌ర్ ఆబిద్ అలీ (60; 7 ఫోర్లు) అర్ధ‌శ‌త‌కం సాధించ‌డంతో పాక్ జ‌ట్టు కోలుకుంది. అయితే కెప్టెన్ అజ‌హ‌ర్ అలీ (20), అస‌ద్ ష‌ఫీఖ్ (5), ఫ‌వ‌ద్ ఆల‌మ్ (0) విఫ‌ల‌మ‌య్యారు. స్టార్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజ‌మ్ (25 బ్యాటింగ్‌), వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్ (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో అండ‌ర్స‌న్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బ్రాడ్‌, క‌ర‌న్‌, వోక్స్ త‌లా ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నారు. 


logo