మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 13, 2020 , 18:08:25

వ‌ర్షం అడ్డంకి: పాకిస్థాన్ 62/1

 వ‌ర్షం అడ్డంకి: పాకిస్థాన్ 62/1

సౌతాంప్ట‌న్‌: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ లంచ్ స‌మ‌యానికి ఒక వికెట్ న‌ష్టానికి 62 ప‌రుగులు చేసింది. ఆరంభంలోనే షాన్ మ‌సూద్ (1) వికెట్లు కోల్పోయినా.. అనంత‌రం మ‌రో ఓపెన‌ర్ ఆబిద్ అలీ (33), కెప్టెన్ అజ‌హ‌ర్ అలీ (20) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. 24వ ఓవ‌ర్ న‌డుస్తున్న స‌మ‌యంలో వ‌ర్షం అంత‌రాయం క‌లిగించ‌డంతో మ్యాచ్ నిలిచిపోయింది. అనంత‌రం వ‌రుణ‌డు తెరిపినివ్వ‌గా.. అంపైర్లు లంచ్ బ్రేక్ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం మైదానం చిత్త‌డిగా మార‌డంతో మ్యాచ్ ప్రారంభం అయ్యేందుకు ఇంకాస్త స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. logo