సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 15, 2020 , 19:46:42

మూడో రోజూ అదే తీరు

మూడో రోజూ అదే తీరు


సౌతాంప్ట‌న్‌: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అతాల‌కుత‌లం చేస్తున్న త‌రుణంలోనూ ప్ర‌త్యేక ఏర్పాట్ల మ‌ధ్య నిర్వ‌హిస్తున్న ఇంగ్లండ్‌, పాకిస్థాన్ టెస్టు సిరీస్‌ను వ‌రుణుడు వ‌ద‌ల‌డం లేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా  తొలి టెస్టులో ఓ రోజు ఆట‌ను మింగేసిన వ‌ర్షం.. రెండో టెస్టును అస‌లు ముందుకు సాగ‌నివ్వ‌డం లేదు. తొలి రోజు స‌గం ఆట వ‌రుణుడి కార‌ణంగా నిలిచిపోగా.. రెండో రోజు కూడా అదే క‌థ కొన‌సాగింది. ఇక మూడో రోజు ఆట ప్రారంభమే కాలేదు. 

మూడు రోజుల పేరు మీద కేవ‌లం 86 ఓవ‌ర్లు మాత్ర‌మే బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల న‌ష్టానికి 223 ప‌రుగులు చేసింది. వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్ (60 బ్యాటింగ్‌), న‌సీమ్ షా (1) క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ప్రారంభించేందుకు మైదానం అనువుగా లేక‌పోవ‌డంతో ఇప్ప‌టికే రెండు సార్లు ఔట్‌ఫీల్డ్‌ను ప‌రిశీలించిన అంపైర్లు మ‌రోసారి చూసి మూడో రోజు ఆట‌ను ముగించే అవ‌కాశాలు ఉన్నాయి. logo