గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Nov 13, 2020 , 00:48:12

ఆదరణ అదరహో..

ఆదరణ అదరహో..

  • ఐపీఎల్‌కు 28 శాతం పెరిగిన ప్రేక్షకాదరణ

ముంబై: ఇటీవల ముగిసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌కు అదిరిపోయే ఆదరణ లభించింది. కరోనా కష్టకాలంలో.. యూఏఈ వేదికగా బయో బబుల్‌లో ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించిన ఈ లీగ్‌కు ప్రేక్షకులు టీవీల్లో బ్రహ్మరథం పట్టారు. గత సీజన్‌తో పోలిస్తే డిజిటల్‌ ప్రేక్షకాదరణలో 28 శాతం పెరుగుదల నమోదవడం గమనార్హం. ఈ సందర్భంగా 13వ సీజన్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించిన ‘డ్రీమ్‌ ఎలెవన్‌' సంస్థకు ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకులను లీగ్‌వైపు ఆకర్షించడంలో డ్రీమ్‌ ఎలెవన్‌ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగిందన్నారు. మంగళవారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌ రికార్డు స్థాయిలో ఐదో టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.