సోమవారం 13 జూలై 2020
Sports - May 11, 2020 , 23:35:56

గోపీచంద్‌కు గృహ నిర్బంధం

గోపీచంద్‌కు గృహ నిర్బంధం

 కోదాడ రూరల్‌: భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ను 28 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలంటూ అధికారులు సోమవారం స్టాంప్‌ వేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అనుమతితో హైదరాబాద్‌కు వస్తుండగా సూర్యపేట జిల్లా కోదాడ మండలం రామాపురం రాష్ట్ర సరిహద్దు వద్ద అధికారులు గోపీచంద్‌కు వైద్యపరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్‌ లక్షణాలేమి లేనప్పటికీ..నిబంధనల ప్రకారం ఆయనను గృహ నిర్బంధంలో ఉండాలని స్టాంప్‌ వేసినట్లు కోదాడ మండల వైద్యాధికారి కల్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. 


logo