బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 12, 2020 , 18:08:55

ముంబై క్రికెటర్‌ ఆత్మహత్య

ముంబై క్రికెటర్‌ ఆత్మహత్య

ముంబై: కొవిడ్‌ మహమ్మారి వల్ల చాలారోజులుగా క్రికెట్‌కు దూరంకావడం, ఎంత ప్రయత్నించినా సీనియర్‌ జట్టులో స్థానం పొందలేక పోవడంతో మనస్థాపం చెందిన ఓ యువ క్రికెటర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముంబైలోని మలాద్‌లో నివసించే  కరణ్ తివారీ (27) అనే ముంబై క్రికెటర్‌  తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోకెళ్లి గడియపెట్టుకున్న అతడు ఎంతకూ రాకపోయే సరికి అనుమానించిన స్నేహితులు, కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి చూడగా, విగత జీవిగా కనిపించాడు.

కరణ్ తివారీ ముంబై ప్రొఫెషనల్ క్రికెట్ జట్టులో భాగం కాదు కానీ అతడు వారికి నెట్ బౌలర్. సగటు మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. తల్లి, సోదరుడితో కలిసి మలాద్‌లో నివాసముంటున్నాడు. క్రికెట్‌ అంటే అతడికి మక్కువ. అయితే, తన ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం రావడం లేదంటూ బాధపడుతుండేవాడు. అలాగే, కొవిడ్‌ నేపథ్యంలో చాలారోజులుగా ఆటకు దూరమయ్యాడు. దీంతో మనస్థాపం చెందాడు. ఈ విషయాన్ని రాజస్థాన్‌లో ఉండే తన మిత్రునితో చెప్పి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు మిత్రుడు కరణ్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించేలోగానే ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. దీంతో పోలీసులు యాక్సిడెంటల్‌ డెత్‌గా కేసు నమోదు చేశారు.    


logo