బుధవారం 20 జనవరి 2021
Sports - Dec 08, 2020 , 16:47:34

విరాట్‌ కోహ్లీ అర్థశతకం..ఒకే ఓవర్లో రెండు వికెట్లు

విరాట్‌ కోహ్లీ అర్థశతకం..ఒకే ఓవర్లో రెండు వికెట్లు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టీ20లో టీమ్‌ఇండియా నిలకడగా ఆడుతోంది. ఆసీస్‌ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(50: 41 బంతుల్లో 3ఫోర్లు) అర్ధశతకం పూర్తి చేశాడు.  ఆతిథ్య బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ జట్టును లక్ష్యం దిశగా నడిపిస్తున్నాడు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(0), శిఖర్‌ ధావన్‌(28) ఔటైనా తనదైన శైలిలో స్టైలిష్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ జోరుగా బ్యాటింగ్‌ చేయడంతో పవర్‌ప్లలో భారత్‌  55/1తో పటిష్ఠస్థితిలో నిలిచింది. 

13వ ఓవర్లో భారత్‌ రెండు వికెట్లు కోల్పోయింది.   స్వెప్సన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు యత్నించిన సంజూ శాంసన్‌(10)  ఔటయ్యాడు.  అదే ఓవర్‌లో అప్పుడే క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(0)  ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు.   13 ఓవర్లకు భారత్‌ 4 వికెట్లకు 100 పరుగులు చేసింది.  ప్రస్తుతం కోహ్లీ(56) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 


logo