గురువారం 28 జనవరి 2021
Sports - Nov 27, 2020 , 12:18:06

సిడ్నీ వ‌న్డే.. ఫించ్ సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచ‌రీ

సిడ్నీ వ‌న్డే.. ఫించ్ సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచ‌రీ

సిడ్నీ: ఇండియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ సెంచ‌రీ చేశాడు. వ‌న్డేల్లో అత‌నికిది 17వ సెంచ‌రీ కావ‌డం విశేషం. 117 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో ఫించ్ సెంచరీ పూర్తి చేశాడు. వార్న‌ర్‌తో క‌లిసి తొలి వికెట్‌కు 156 ప‌రుగులు జోడించిన ఫించ్‌.. త‌ర్వాత స్మిత్‌తోనూ మంచి భాగ‌స్వామ్యంతో ఆసీస్‌ను భారీ స్కోరు దిశ‌గా తీసుకెళ్తున్నాడు. మ‌రోవైపు స్మిత్ చెల‌రేగి ఆడుతున్నాడు. కేవ‌లం 38 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. సెంచ‌రీ చేసిన వెంట‌నే 114 ప‌రుగులు చేసి ఫించ్ ఔట‌‌య్యాడు. బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫించ్ త‌ర్వాత వ‌చ్చిన స్టాయినిస్.. చాహ‌ల్ బౌలింగ్‌లో ఆడిన తొలి బంతికే ఔట‌య్యాడు.


logo