మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Nov 20, 2020 , 14:33:24

డోపింగ్‌లో దొరికిన నేష‌న‌ల్ చాంపియ‌న్‌

డోపింగ్‌లో దొరికిన నేష‌న‌ల్ చాంపియ‌న్‌

న్యూఢిల్లీ:  హ్యామ‌ర్ త్రోలో నేష‌న‌ల్ చాంపియ‌న్‌, ఫెడ‌రేష‌న్ క‌ప్ సీనియ‌ర్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్‌లో గోల్డ్ మెడ‌లిస్ట్ అనిత.. డోపింగ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. టెస్టోస్టెరాన్ లెవ‌ల్ అధికంగా ఉన్న‌ట్లు గుర్తించారు. దీంతో నేష‌న‌ల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఆమెపై స‌స్పెన్ష‌న్ విధించింది. అక్టోబ‌ర్ 22 నుంచే ఆమెపై స‌స్పెన్ష‌న్ అమ‌ల్లోకి వ‌చ్చింది. గ‌తేడాది మార్చిలోనే ఫెడ‌రేష‌న్ క‌ప్ మీట్‌లో ఆమె శాంపిల్స్‌ను సేక‌రించారు. 19 నెల‌ల త‌ర్వాత ఇప్పుడు దాని ఫ‌లితాలు వ‌చ్చాయి. నాడా ఎనిమిది నెల‌ల త‌ర్వాతే మ‌ళ్లీ శాంపిల్స్ సేక‌ర‌ణ మొద‌లుపెట్టింది. ఈ మ‌ధ్యే టాప్ రెజ్ల‌ర్లు న‌ర్సింగ్ యాద‌వ్‌, బ‌జ‌రంగ్ పూనియా, వినేష్ పోగాట్‌, పూజా దండాల శాంపిల్స్ తీసుకున్నారు. అంతేకాదు ఈ మ‌ధ్యే ముగిసిన ఐపీఎల్ నుంచి 48 మంది క్రికెట‌ర్ల శాంపిల్స్ కూడా సేక‌రించ‌డం విశేషం. ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు మాజీ కెప్టెన్ ధోనీ, రాహుల్‌, ర‌వీంద్ర జ‌డేజాలాంటి వాళ్లు ఉన్నారు. జ‌ర్మ‌నీలోని కొలోన్‌కు ఈ శాంపిల్స్‌ను ప‌రీక్ష‌ల కోసం పంపించారు.