బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 22, 2020 , 19:02:55

RR vs SRH: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వార్నర్‌

RR vs SRH: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వార్నర్‌

దుబాయ్‌: ఐపీఎల్-13లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.  రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్లు దుబాయ్‌ వేదికగా తలపడనున్నాయి.   ఇరు జట్లు కూడా ప్లే-ఆఫ్స్‌ బెర్తు కోసం పోరాడుతున్నాయి.  విజయ పరంపర కొనసాగించాలని స్టీవ్‌స్మిత్‌సేన భావిస్తుండగా..మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి ప్లే-ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని డేవిడ్‌ వార్నర్‌సేన ఆశిస్తోంది.   

టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్నాడు. కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో హోల్డర్‌ జట్టులోకి వచ్చాడు. బసిల్‌ థంపీ స్థానంలో  షాబాజ్‌ నదీమ్‌ను టీమ్‌లోకి తీసుకున్నట్లు వార్నర్‌ చెప్పాడు.  గత మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా కేన్‌ గాయపడిన విషయం తెలిసిందే.