శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 17, 2020 , 19:04:44

IPL 2020: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోనీ

IPL 2020:  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోనీ

షార్జా:  ఐపీఎల్‌-13లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. గత మ్యాచ్‌ల్లో ధనాధన్‌ ఆటతో ప్రత్యర్థులను  బెంబేలెత్తించిన  ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌  ఇవాళ అమీతుమీ తేల్చుకోనున్నాయి.   టాస్‌ గెలిచిన చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.  పియూశ్‌ చావ్లా స్థానంలో కేదార్‌ జాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు మహీ తెలిపాడు. 

గాయం నుంచి కోలుకున్న  వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌కు ఈ మ్యాచ్‌లోనూ విశ్రాంతినిచ్చినట్లు ఢిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ వివరించాడు.   ప్రస్తుతం ఢిల్లీ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు చెన్నై మూడు విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.