మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 10, 2020 , 20:33:41

CSK vs RCB: ఒకే ఓవర్లో రెండు వికెట్లు

CSK vs RCB: ఒకే ఓవర్లో రెండు వికెట్లు

దుబాయ్:   చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు  ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన 11వ ఓవర్లో    వేగంగా ఆడే క్రమంలో  యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌(33)  ఔటయ్యాడు.  అదే ఓవర్‌ ఐదో బంతికే  ప్రమాదకర డెవిలియర్స్‌(0) వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ చేతికి చిక్కాడు.  12 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి బెంగళూరు  పరుగులే చేసింది. కెప్టెన్‌  విరాట్‌ కోహ్లీ(26), వాషింగ్టన్‌ సుందర్‌(1) క్రీజులో ఉన్నారు. 

అంతకుముందు  చెన్నై పేసర్‌ దీపక్‌ చాహర్‌ వేసిన మూడో ఓవర్లోనే బెంగళూరు ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ బౌల్డయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి బెంగళూరు 36/1తో నిలిచింది.  ఫించ్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ  నిదానంగా బ్యాటింగ్‌ చేయడంతో స్కోరు వేగం తగ్గింది.  తొలి పది ఓవర్లలో  బెంగళూరు వికెట్‌ నష్టానికి 65 పరుగులే చేసింది.