ఆదివారం 06 డిసెంబర్ 2020
Sports - Sep 27, 2020 , 01:10:31

శాంసన్‌ లేకపోవడమా!: వార్న్‌

శాంసన్‌ లేకపోవడమా!: వార్న్‌

దుబాయ్‌: భారత యువ ఆటగాడు సంజూ శాంసన్‌పై ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడో అద్భుతమైన ప్లేయర్‌ అని, భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అతడికి చోటు దక్కకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నదని శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అన్నాడు. ఐపీఎల్‌లో వార్న్‌ మెంటార్‌గా ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున శాంసన్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సంజూ 32 బంతుల్లోనే 74 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శాంసన్‌ గురించి వార్న్‌ మాట్లాడాడు. చాలాకాలం తర్వాత తాను చూసిన అత్యంత అద్భుతమైన వర్ధమాన ఆటగాడు అతడేనని అన్నాడు.