శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sports - Sep 19, 2020 , 22:40:03

MI vs CSK : రాయుడు వీరబాదుడు

MI vs CSK : రాయుడు వీరబాదుడు

అబుదాబి: ఐపీఎల్‌-2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు అదరగొడుతున్నాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ముంబై బౌలర్లపై ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు.  33 బంతుల్లోనే 6ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 13వ సీజన్‌లో తొలి హాఫ్‌సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.  163 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన చెన్నై ఆరు పరుగులకే ఓపెనర్లను చేజార్చుకుంది. 

స్పీడ్‌స్టర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో హార్డ్‌హిట్టర్‌ షేన్‌ వాట్సన్‌(4) ఎల్బీడబ్లుగా వెనుదిరిగాడు. ప్యాటిన్సన్‌ వేసిన  తర్వాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్‌  మురళీ విజయ్‌(1) కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు.  రాయుడు విజృంభిస్తుండగా డుప్లెసిస్‌ సహకారం అందిస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై  2 వికెట్లకు 99 పరుగులు చేసింది. డుప్లెసిస్‌(31), రాయుడు(60) క్రీజులో ఉన్నారు.