శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 10, 2020 , 02:18:37

నమ్మకమే ముఖ్యం: కోహ్లీ

నమ్మకమే ముఖ్యం: కోహ్లీ

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ ఆడేందుకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఉత్సుకతతో ఉన్నాడు. సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా జరుగనున్న ఈ లీగ్‌ కోసం సిద్ధమవుతున్న కోహ్లీ.. ఆర్సీబీతో తనకున్న అనుబంధాన్ని ఆదివారం ఓ వీడియో రూపం లో విడుదల చేశాడు. ‘నమ్మకమే అన్నింటికంటే అత్యుత్తమమైనది. లీగ్‌ కోసం ఎదురుచూస్తున్నా’ అని వ్యాఖ్య జోడించాడు. ఐపీఎల్‌ ఆరంభం నుంచి బెంగళూరు తరఫునే ఆడుతున్న కోహ్లీ ఈ వీడియోలో.. గతంలో తన ఇంటర్వ్యూలతో పాటు డ్రెస్సింగ్‌ రూమ్‌ సరదా సన్నివేశాలను పంచుకున్నాడు. కసరత్తులు, సహచరులతో కలిసి డ్యాన్స్‌ చేయడం, ఎమోషనల్‌ స్పీచ్‌లతో  ఈ వీడియో సాగింది. గత 12 సీజన్లలో ఇప్పటి వరకు బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిట్‌ నెగ్గలేకపోయింది. 


logo