మంగళవారం 14 జూలై 2020
Sports - Apr 24, 2020 , 00:10:41

విండీస్‌ క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజుల్లేవు

విండీస్‌ క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజుల్లేవు

అంటిగ్వా: వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు(సీడబ్ల్యూఐ) ఆర్థిక పరిస్థితి ఘోరంగా తయారైంది. క్రికెటర్లకు కనీసం జీతాలు చెల్లించలేని పరిస్థితులతో సతమతమవుతున్నది. ఇప్పుడే ఇలాగుంటే.. భవిష్యత్తులో ఇంకా ఎన్ని సమస్యలు ఎదురవుతాయోనని బోర్డు పెద్దలు ఆందోళనతో కనిపిస్తున్నారు. గత జనవరి నుంచి అంతర్జాతీయ క్రికెటర్లకు తోడు, దేశవాళీ ఆటగాళ్లకు వేతనాలు చెల్లించలేని దీన స్థితిలో విండీస్‌ బోర్డు నడుస్తున్నది. దీనిపై వెస్టిండీస్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌(డబ్ల్యూఐపీఏ)కార్యదర్శి వెయిన్‌ లూయిస్‌ గురువారం మీడియాతో మాట్లాడాడు. ‘ఈ నెల వరకు ఆటగాళ్లకు అందాల్సిన నెల జీతాలు ఇచ్చాం. దేశవాళీలో ఆడిన ఆటగాళ్లకు ఎనిమిది రౌండ్లకు చెల్లించాల్సిన మ్యాచ్‌ ఫీజులు ఇంకా ఇవ్వలేదు. దీనికి తోడు స్వదేశంలో జనవరిలో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌తో పాటు శ్రీలంక పర్యటనలో ఆడిన పురుషుల జట్టుకు మ్యాచ్‌ ఫీజులు చెల్లించాల్సి ఉంది’ అని ఆయన అన్నాడు. 


logo