సోమవారం 30 మార్చి 2020
Sports - Mar 24, 2020 , 00:26:55

నేనెదుర్కొన్న దారుణ వైరస్‌ ఇది

 నేనెదుర్కొన్న దారుణ వైరస్‌ ఇది

జొహాన్నెస్‌బర్గ్‌: కరోనా వైరస్‌ను దీటుగా ఎదుర్కొనేది యువత మాత్రమే అనుకున్నాం. ఈ విషయం డాక్టర్లు కూడా చెబుతున్నారు. విశ్వమారి కరోనా బారిన పడ్డ యువత తగిన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగానే కోలుకుంటారని అనేక అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. అందులో యువ క్రీడాకారుడైతే ఇట్టే అధిగమిస్తాడని కొందరు అనుకునే అవకాశముంది. అయితే అలాంటి అలసత్వం అసలు పనికిరాదని దక్షిణాఫ్రికా ప్రముఖ స్విమ్మర్‌ కామెరాన్‌ వాండర్‌బర్గ్‌ అంటున్నాడు. రియో(2016) ఒలింపిక్స్‌ రజత పతక విజేత అయిన వాండర్‌ ఇటీవలే ప్రమాదకర కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. ఇప్పుడిప్పుడే వైరస్‌ నుంచి కోలుకుంటున్న ఈ స్టార్‌ స్విమ్మర్‌ తన అనుభవాలను సోషల్‌ మీడియా ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నాడు. ‘గత పద్నాలుగు రోజులుగా నేను కరోనాతో పోరాడుతున్నాను. మొదట్లో తీవ్రమైన జ్వరం తీవ్రంగా వేధించింది. శారీరక అలసట మాత్రం నన్ను తీవ్రంగా వేధిస్తున్నది. కొద్ది దూరం నడిచినా ఆయాసం వస్తున్నది. నా వయసు 31..నేనేప్పుడు ధూమపానం జోలికి పోలేదు.  అయినా వైరస్‌ తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఇంత దారుణమైన వైరస్‌ను నేను ఎప్పుడూ ఎదుర్కొలేదు’ అని వాండర్‌ అన్నాడు. 


logo