మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 24, 2020 , 00:26:55

కరోనాపై పోరుకు ఆర్నెళ్ల జీతం విరాళం

కరోనాపై పోరుకు ఆర్నెళ్ల జీతం విరాళం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా ఆరునెలల వేతనాన్ని విరాళంగా ఇచ్చాడు. కొవిడ్‌-19 విజృంభిస్తున్న తరుణంలో టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహించడం సబబుకాదని.. విశ్వక్రీడలను వాయిదా వేయడమే మంచిదని అతడు పేర్కొన్నాడు. ‘నా ఆర్నెళ్ల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నా’ అని బజరంగ్‌ సోమవారం ట్విట్టర్‌ వేదికగా తెలిపాడు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు.. స్టార్‌ రెజ్లర్‌ను అభినందించారు. ‘ఒలింపిక్స్‌ కంటే ముందు మనం కరోనా వైరస్‌తో పోరాడాల్సిన అవసరం ఉంది. ఇంకొద్ది రోజులు ఇలాంటి పరిస్థితులే కొనసాగితే.. ఒలింపిక్స్‌ను వాయిదా వేయడమే ఉత్తమం. ఇప్పటికే విశ్వక్రీడల్లో పాల్గొన కూడదని చాలా దేశాలు నిర్ణయించుకున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా తమ అథ్లెట్లను టోక్యోకు పంపకూడదని తీర్మానించుకున్నాయి. కొవిడ్‌-19 ప్రస్తుతం ప్రపంచ సమస్య. ముందు దాన్నుంచి బయటపడాలి’ అని బజరంగ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు.


logo
>>>>>>