మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 24, 2020 , 00:26:21

స్వీయ నిర్బంధమా.. కారాగారమా?

స్వీయ నిర్బంధమా.. కారాగారమా?

  • ప్రజలే తేల్చుకోవాలన్న గౌతమ్‌ గంభీర్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఇండ్లకే పరిమితమవ్వండని సూచించినా..  యథేచ్చగా రోడ్లపై తిరుగుతున్నవారిపై మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి వారి వల్ల మహమ్మారి మరింత ప్రబలే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి వారు క్షేమంగా ఇండ్లలో ఉండాలనుకుంటున్నారా.. లేక జైళ్లకు వెళ్లాలనుకుంటున్నారా తేల్చుకోవాలని అన్నాడు. కొవిడ్‌-19 పోరాటంలో యావత్‌ దేశం లాక్‌డౌన్‌ పాటిస్తుంటే.. కొంత మంది మాత్రం వారి శ్రమకు ఫలితం దక్కకుండా చేస్తున్నారన్నాడు. ‘మీరూ పోతారు, మీతో పాటు కుటుంబ సభ్యులను కూడా పట్టుకుపోతారు (ఖుద్‌ భీ జాయేంగే.. ఔర్‌ సాత్‌ మే పరివార్‌కో భీ లేకే జాయేంగే). స్వీయ నిర్బంధమా.. కారాగారమా తేల్చుకోండి?’ అని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నాడు. ‘సమాజానికి చేటు చేయకండి. దేశమంతా వైరస్‌కు ఎదురొడ్డి పోరాడుతుంటే.. లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించడం సరైంది కాదు’ అని గంభీర్‌ వాపోయాడు.

వైద్య పరికరాల కోసం రూ.50 లక్షలు

మహమ్మారి నుంచి నగరాన్ని కాపాడుకునేందుకు అవసరమైన వైద్య పరికరాలు కొనేందుకు ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు గంభీర్‌ లేఖ రాశా డు. ‘కొవిడ్‌-19 నుంచి పౌరులను కాపాడటానికి అవసరమైన వైద్య పరికరాలు కొనేందుకు ఎంపీ నిధుల్లోనుంచి రూ. 50 లక్షలు కేటాయించాలనుకుంటున్నా’ అని లేఖలో పేర్కొన్నాడు.


logo
>>>>>>