బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 10, 2020 , 23:51:44

పాక్‌ జెర్సీపై ధోనీ పేరు

పాక్‌ జెర్సీపై ధోనీ పేరు

లాహోర్‌: అభిమానానికి హద్దులు లేవంటారు. అవును క్రికెట్‌ అంటే పడిచచ్చే ఉపఖండంలోనైతే మరీను. తనదైన ఆటతీరు, నాయకత్వశైలితో రాణించిన ధోనీని అభిమానించే వాళ్లు భారత్‌లోనే కాదు పాకిస్థాన్‌లోనూ ఉన్నారు. సరిహద్దులు వేరైనా..అభిమానానికి అవి అడ్డురావని పాక్‌కు చెందిన షెహజాద్‌ ఉల్‌ హసన్‌ నిరూపించాడు. పీఎస్‌ఎల్‌లో ఇస్లామాబాద్‌ జట్టుకు మద్దతు పలుకుతున్న షెహజాద్‌..స్టేడియానికి ధోనీ పేరు ఉన్న పాక్‌ జెర్సీ ధరించి వచ్చాడు. ఇది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘స్టేడియంలో భాయ్‌..! స్టాండ్స్‌ పూర్తిగా నిండిపోయాయి. ఇస్లామాబాద్‌కు నా పూర్తి మద్దతు. పీఎస్‌ఎల్‌లో ధోనీని మిస్‌ అవుతున్నాం’ అంటూ ట్వీట్‌  చేశాడు. 


logo