మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 11, 2020 , 12:29:47

NZvIND:గప్తిల్‌ ధనాధన్‌ ఫిఫ్టీ

NZvIND:గప్తిల్‌ ధనాధన్‌ ఫిఫ్టీ

మౌంట్‌ మాంగనీ:  మూడో వన్డేలో న్యూజిలాండ్‌ హార్డ్‌హిట్టర్‌ మార్టిన్‌ గప్తిల్‌ వీరవిహారం చేస్తున్నాడు. భారత్‌ నిర్దేశించిన  297 పరుగుల లక్ష్య ఛేదనలో  గప్తిల్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో కివీస్‌కు మంచి శుభారంభం అందించాడు. శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన 11వ ఓవర్లో భారీ సిక్సర్‌ బాది కేవలం 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.  మరో ఓపెనర్‌ నికోల్స్‌.. గప్తిల్‌కు సహకారం అందిస్తున్నాడు. 

ఓపెనింగ్‌ జోడీని విడగొట్టడంలో భారత్‌ బౌలర్లు విఫలమయ్యారు. క్రీజులో కుదురుకున్న ఓపెనర్లు వేగంగా ఆడుతూ మంచి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా దూసుకెళ్తున్నారు. తొలి 10 ఓవర్లలో విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ మార్పులు చేసినా ఫలితం దక్కలేదు. అందరు బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. 13 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ వికెట్‌ నష్టపోకుండా న్యూజిలాండ్‌ 91 పరుగులు చేసింది. గప్తిల్‌(60), నికోల్స్‌(28) క్రీజులో ఉన్నారు. logo
>>>>>>