బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 03, 2020 , 18:25:04

'పరుగుల రాజా' రాహుల్‌.. కెరీర్‌లోనే బెస్ట్ ర్యాంకు

'పరుగుల రాజా' రాహుల్‌.. కెరీర్‌లోనే బెస్ట్ ర్యాంకు

ఐసీసీ ప్రకటించిన బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో రాహుల్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకు అందుకున్నాడు.

  • KL Rahul jumps to career best second place

దుబాయ్‌:  భీకర ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్‌ రాహుల్‌ న్యూజిలాండ్‌ పర్యటనలోనూ విశేషంగా రాణించాడు.  న్యూజిలాండ్‌ గడ్డపై తొలిసారి పొట్టి  సిరీస్‌ను గెలవడంలో రాహుల్‌ కీలక పాత్ర పోషించాడు. ఐదు టీ20ల్లో వరుసగా 56, 57 నాటౌట్‌, 27, 39,  45 పరుగులతో సమయోచిత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న రాహుల్‌(మొత్తం 224 పరుగులు) మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డును అందుకున్నాడు. పొట్టి సిరీస్‌లో బ్యాట్‌తో సహా వికెట్‌ కీపింగ్‌లోనూ సత్తాచాటాడు.  

తాజాగా ఐసీసీ ప్రకటించిన బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో రాహుల్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకు అందుకున్నాడు. 823 రేటింగ్‌ పాయింట్లతో ఏకంగా రెండో స్థానానికి దూసుకొచ్చాడు. టాప్‌-10లో భారత్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం.  విరాట్‌ కోహ్లీ మూడు.. రోహిత్‌ శర్మ పదో స్థానంలో నిలిచారు. పాకిస్థాన్‌ ప్లేయర్‌ బాబర్‌ అజాం అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో యువ స్పీడ్‌స్టర్‌ జస్ప్రిత్‌ బుమ్రా ఏకంగా 26స్థానాలు ఎగబాకాడు. కివీస్‌తో టీ20సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా..విండీస్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌తో సంయుక్తంగా 11వ ర్యాంకు దక్కించుకున్నాడు.  ఐసీసీ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో పాక్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ టాప్‌-౩లో ఉండగా భారత్‌ నాలుగులో కొనసాగుతోంది. logo
>>>>>>