శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Jan 25, 2020 , 00:02:53

పాక్‌ను గెలిపించిన మాలిక్‌

పాక్‌ను గెలిపించిన మాలిక్‌
  • Shoaib Malik shines on return to help Pakistan take 1-0 lead vs Bangladesh

లాహోర్‌: పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ సత్తాచాటింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. నయీమ్‌ (43), తమీమ్‌ ఇక్బాల్‌ (39) రాణించారు. అనంతరం టార్గెట్‌ ఛేజింగ్‌లో వెటరన్‌ బ్యాట్స్‌మన్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' షోయబ్‌ మాలిక్‌ (58) అర్ధశతకంతో మెరువడంతో పాక్‌ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసి గెలిచింది. అరంగేట్ర ఆటగాడు ఎహసాన్‌ అలీ (36) ఆకట్టుకున్నాడు. 


logo