మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 16, 2020 , 15:48:33

క్రికెటర్ల వార్షిక ఒప్పందాలు ప్రకటించిన బీసీసీఐ.. ధోనికి దక్కని చోటు

క్రికెటర్ల వార్షిక ఒప్పందాలు ప్రకటించిన బీసీసీఐ.. ధోనికి దక్కని చోటు

ముంబయి: బీసీసీఐ(ది బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా) గురువారం భారత క్రికెటర్ల(సీనియర్‌ మెన్స్‌ క్రికెటర్స్‌) వార్షిక ఒప్పందాలను ప్రకటించింది. కాగా, ఈ జాబితాలో సీనియర్ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చోటు దక్కలేదు. అక్టోబర్‌ 2019 నుంచి సెప్టెంబర్‌ 2020 వరకు ఈ ఒప్పందం ఉంటుంది. బీసీసీఐ.. ఆటగాళ్లను వారి పర్ఫార్మెన్స్‌కు తగ్గట్లు 4 విభాగాలుగా(గ్రేడ్‌-ఏ+, గ్రేడ్‌-ఏ, గ్రేడ్‌-బి, గ్రేడ్‌-సి) విభజించి, వారికి వార్షిక వేతనాలు అందిస్తుంది. గ్రేడ్‌ ఏ+ ఆటగాళ్లకు 7 కోట్లు, ఏ గ్రేడ్‌ ఆటగాళ్లకు 5 కోట్లు, బి గ్రేడ్‌ ఆటగాళ్లకు 3 కోట్లు, సి గ్రేడ్‌ ఆటగాళ్లకు 1 కోటి రూపాయలు చెల్లిస్తుంది.


గ్రేడ్‌ ఏ+ ఆటగాళ్లు: విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా.

గ్రేడ్‌ ఏ ఆటగాళ్లు: రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, ఛటేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే, కే ఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, మహమ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ, కుల్దీప్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌.

గ్రేడ్‌ బి ఆటగాళ్లు: వృద్ధిమాన్‌ సాహా, ఉమేష్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, హార్దిక్‌ పాండ్యా, మయాంక్‌ అగర్వాల్‌.

గ్రేడ్‌ సి ఆటగాళ్లు: కేదార్‌ జాదవ్‌, నవదీప్‌ సైనీ, దీపక్‌ చాహర్‌, మానిష్‌ పాండే, హనుమ విహారి, షార్ధూల్‌ ఠాకూర్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌.

కాగా, ఈ కాంట్రాక్టు జాబితాలో నవదీప్‌ సైనీ, శ్రేయాస్‌ అయ్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌ తొలిసారి చోటు దక్కించుకున్నారు.


logo
>>>>>>