బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 16, 2020 , 23:57:31

క్రికెట్‌ బామ్మఇకలేరు

క్రికెట్‌ బామ్మఇకలేరు


న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును ఉత్సాహపరుస్తూ కనిపించిన టీమ్‌ఇండియా ‘సూపర్‌ ఫ్యాన్‌' చారులతా పటేల్‌ (87) కన్నుమూశారు. మెగాటోర్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా బూర ఊదుతూ సందడి చేసిన క్రికెట్‌ బామ్మ ఈనెల 13న మృతి చెందినట్లు ఓ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఆమె మృతిపై స్పందించిన భారత క్రికెట్‌ నియంత్రణా మండలి (బీసీసీఐ) ట్విట్టర్‌ వేదికగా గురువారం సం తాపం వ్యక్త చేసింది. ఆమె ఎప్పటికీ మన హృదయాల్లో ఉండిపోతుందని పేర్కొంది. బంగ్లాతో పోరులో ఆమె సందడి చేయడాన్ని గమనించిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మ్యా చ్‌ ఆనంతరం ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు తదుపరి మ్యాచ్‌లు చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.


logo
>>>>>>