ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Jul 02, 2020 , 00:47:21

ఆ ఓటమి కుంగదీసింది: ఏబీ

ఆ ఓటమి కుంగదీసింది: ఏబీ

న్యూఢిల్లీ: 2015 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఓటమి తనను ఎంతోగానో కుంగదీసిందని దక్షణాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ అన్నాడు. క్రికెట్‌ నుంచి తాను ఆకస్మికంగా రిటైరవడానికి ఆ పరాజయం ఓ బలమైన కారణమైందని చెప్పుకొచ్చాడు. కామెంటేటర్‌ హర్షా భోగ్లే బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో డివిలియర్స్‌ పలు అంశాలపై మాట్లాడాడు. ‘ప్రపంచకప్‌ ఓటమి నా కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ రోజు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో గెలుపు అంచుల దాకా వెళ్లి ఓడిపోవడం తీవ్రంగా కలచి వేసింది. ఆ తర్వాత దాదాపు ఏడాది పాటు కష్టంగా గడిచింది. ఆ సమయంలో ఒంటరి అయిపోయానన్న భావన కలిగింది’ అని ఏబీ అన్నాడు.  టాప్‌ ఫామ్‌లో ఉండగానే 2018 మేలో అంతర్జాతీయ క్రికెట్‌కు డివిలియర్స్‌ వీడ్కోలు పలికాడు. కాగా తన ఆల్‌స్టార్‌ బెస్ట్‌ ఐపీఎల్‌ ఎలెవెన్‌ను ఏబీ వెల్లడించాడు. ఆ జట్టుకు ఎంఎస్‌ ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. 

డివిలియర్స్‌ ఆల్‌స్టార్‌ ఐపీఎల్‌ ఎలెవెన్‌: వీరేంద్ర సెహ్వాగ్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌/స్మిత్‌, విలియమ్సన్‌, బెన్‌ స్టోక్స్‌, ధోనీ, రవీంద్ర జడేజా, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కగిసో రబాడ, జస్ప్రీత్‌ బుమ్రా  

VIDEOS

logo