అహ్మదాబాద్‌లో 2 టెస్టులు, 5 టీ20లు

- భారత్‌లో ఇంగ్లండ్ షెడ్యూల్ ఖరారు
న్యూఢిల్లీ: భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ ఆతిథ్యానికి వేళయింది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా స్వదేశంలో ఇన్నాళ్లు నిలిచిపోయిన సిరీస్‌లు వచ్చే ఏడాదిలో మొదలుకాబోతున్నాయి. భారత్‌లో ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘ పర్యటన షెడ్యూల్ గురువారం ఖరారైంది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన బయో సెక్యూర్ వాతావరణంలో జరిగే పర్యటనకు సంబంధించిన వివరాలను బీసీసీఐ కార్యదర్శి జై షా మీడియాకు వివరించారు. పర్యటనలో భాగంగా ఇంగ్లిష్ జట్టు నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. తొలి రెండు టెస్టులకు చెన్నై వేదిక కానుండగా, మిగిలిన రెండు టెస్టులకు అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన అతిపెద్ద(సామర్థ్యం లక్షా పదివేలు)అంతర్జాతీయ స్టేడియం ‘మోతెరా’ ఆతిథ్యమివ్వనుంది. మార్చి 12 నుంచి జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మోతెరా స్టేడియం వేదిక కాబోతున్నది. మరోవైపు మార్చి 23 నుంచి మొదలయ్యే మూడు వన్డేలు పుణెలో జరుగనున్నట్లు షా పేర్కొన్నాడు.
భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్
తొలి టెస్టు ఫిబ్రవరి 5-9 చెన్నై
రెండో టెస్టు ఫిబ్రవరి 13-17 చెన్నై
మూడో టెస్టు ఫిబ్రవరి 24-28 అహ్మదాబాద్
నాలుగో టెస్టు మార్చి 4-8 అహ్మదాబాద్
టీ20 సిరీస్
తొలి టీ20 మార్చి 12 అహ్మదాబాద్
రెండో టీ20 మార్చి 14 అహ్మదాబాద్
మూడో టీ20 మార్చి 16 అహ్మదాబాద్
నాలుగో టీ20 మార్చి 18 అహ్మదాబాద్
ఐదో టీ20 మార్చి 20 అహ్మదాబాద్
వన్డే సిరీస్
తొలి వన్డే మార్చి 23 పుణె
రెండో వన్డే మార్చి 26 ఫుణె
మూడో వన్డే మార్చి 28 పుణె
తాజావార్తలు
- జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు
- పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణం !
- అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
- పార్లమెంట్ మార్చ్ వాయిదా : బీకేయూ (ఆర్)
- ఢిల్లీ సరిహద్దులో గుడారాలు తొలగిస్తున్న రైతులు
- హెచ్-1 బీ నిపుణులకు గ్రీన్ కార్డ్.. షార్ట్‌కట్ రూటిదే?!
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి
- ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు
- రేపు ఏపీ గవర్నర్‌ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం
- పవన్ కళ్యాణ్‌కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు