ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 22, 2020 , 00:10:35

అర్జున్‌ది ఎంత గొప్ప మనసో..

అర్జున్‌ది ఎంత గొప్ప మనసో..

  • కరోనాపై పోరుకు షూస్‌ వేలం 

న్యూఢిల్లీ: వయసు చిన్నదైనా..మనసు గొప్పదని చాటుకున్నాడు భారత యువ గోల్ఫర్‌ అర్జున్‌ భాటి. ప్రమాదకర కరోనా వైరస్‌పై పోరాడేందుకు అర్జున్‌ మరోమారు ముందుకొచ్చాడు. ఇప్పటికే ఓసారి తన కెరీర్‌లో సాధించిన ట్రోఫీలను అమ్మి  డబ్బులు సేకరించిన ఈ 15 ఏండ్ల కుర్రాడు..తాజాగా షూస్‌ అమ్మడం ద్వారా మరో రూ.3.3 లక్షలు సమకూర్చాడు. తన వంతుగా ప్రధా ని మంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని విరాళమిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నాడు. ‘నేను విజేతగా నిలిచిన 2018 జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ నాటి చిరిగిన షూస్‌ను వేలం వేశాను. వానిశ్‌ ప్రధాన్‌ అంకుల్‌ ఈ షూస్‌ను రూ.3.3 లక్షలకు కొన్నారు. ఈ మొత్తాన్ని పీఎం కేర్స్‌కు విరాళమిస్తున్నాను. మనం బ్రతుకుతామా లేదా అన్నది కాదు, నా దేశం నిలువాలి’ అని అర్జున్‌ ట్వీట్‌ చేశాడు. 


logo