మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 15, 2020 , 13:30:11

10 సెకన్ల యాడ్‌కు ఇంత మొత్తమా!

10 సెకన్ల యాడ్‌కు ఇంత మొత్తమా!

ముంబై:  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొని, క్రీడా రంగంలో అత్యంత ఖరీదైన లీగ్‌ల్లో ఒకటిగా నిలిచింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌).   ఐపీఎల్‌-13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో  ఫ్రాంఛైజీలు, ఆటగాళ్లు,  ప్రకటనకర్తలు సన్నద్ధమవుతున్నారు.   ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రముఖ టీవీ చానెల్‌ స్టార్‌ స్పోర్ట్స్‌  ఇండియా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో, విరామ సమయంలో ప్రకటనల కోసం నిర్దేశించిన సమయాన్ని(స్లాట్లు) ప్రముఖ కంపెనీలన్ని  ముందస్తుగా బుక్‌ చేసుకుంటున్నాయి. 

కరోనాతో అంతర్జాతీయంగా కంపెనీలు, సంస్థల ఆదాయాలు తగ్గినప్పటికీ  తమ బ్రాండింగ్‌ ప్రమోట్‌ చేయించేందుకు భారీగా చెల్లించేందుకు సిద్ధమయ్యాయిఇందులో భాగంగానే 10 సెకన్ల ప్రకటన కోసం రూ. 12.5 లక్షల  వరకు వసూలు చేయాలని స్టార్‌ నిర్ణయించినట్టు సమాచారం.  గతేడాది  తమ బ్రాండింగ్‌ భాగస్వాముల ద్వారా స్టార్‌ రూ. 3000 కోట్లు   ఆదాయాన్ని ఆర్జించింది. వచ్చే సీజన్‌లో రికార్డు  స్థాయిలో వ్యూయర్‌షిప్‌తో పాటు ప్రకటనల ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తోంది.   యాడ్‌ ధరను 20శాతం పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. 


logo